‘బాలయ్య 106’ ఫిబ్రవరి నుంచి షురూ..!
close
Updated : 27/01/2020 22:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బాలయ్య 106’ ఫిబ్రవరి నుంచి షురూ..!

హైదరాబాద్‌: ‘రూలర్‌’ తర్వాత కొంత గ్యాప్‌ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. తన 106వ సినిమాను బోయపాటి శ్రీనుతో చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణకు సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 15 నుంచి సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుందని తెలుస్తోంది. బొద్దుగుమ్మ నమితను సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నారంటూ గతంలో వార్తలు వచ్చినా చిత్ర బృందం నుంచి దానికి సంబంధించి ఎలాంటి ప్రకటనా రాలేదు. బాలయ్యతో పాటు శ్రీకాంత్‌ కీలక పాత్రలో నటించనున్నాడట. ఈ సినిమాను మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. హీరోయిన్‌తో పాటు టైటిల్‌నూ ఖరారు చేయాల్సి ఉంది.

ఈ ఏడాది జూలైలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల సరికొత్త లుక్‌లో కనిపించిన బాలయ్య అభిమానులను ఆశ్చర్యపరిచారు. మరి అదే లుక్‌తో సినిమాలో కనిపిస్తారా? అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఒకవేళ అదే నిజమైతే వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ ఖాయమని చర్చలు సాగుతున్నాయి.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని