అభిమానులకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్వీట్‌
close
Published : 29/01/2020 12:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అభిమానులకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్వీట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అప్‌డేట్ల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తీపి కబురు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఉన్న అభిమానులకు చిత్ర బృందం ఓ అప్‌డేట్‌ ఇచ్చింది. అయితే అది విడుదలకు సంబంధించింది కాదు. తమను అమితంగా ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపేందుకు చిత్ర బృందం ట్విటర్‌లో పెట్టిన పోస్టు. లక్షా 50వేల ఫాలోవర్స్‌ వచ్చిన సందర్భంగా సినిమా యూనిట్‌ అభిమానులనుద్దేశిస్తూ ఈ ట్వీట్‌ చేసింది. అయితే.. విడుదలకు సంబంధించి ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో అభిమానులు కొంత నిరాశ వ్యక్తం చేశారు. కనీసం విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో చెప్పండని ట్విటర్‌ వేదికగా దర్శకుడు రాజమౌళిని కోరుతున్నారు. కాగా.. గతంలో జులై 30న సినిమా విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడ్డట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ పనులు వేగంగా సాగుతున్నట్లు సమాచారం. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రల్లో కనిపిస్తుండగా.. రామ్ చరణ్‌ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్‌ జోడిగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్‌ అజయ్‌దేవగణ్‌ సైతం ఓ కీలక కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని