యువ హృదయాలను హత్తుకునేలా ‘జాను’ ట్రైలర్‌
close
Published : 29/01/2020 17:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యువ హృదయాలను హత్తుకునేలా ‘జాను’ ట్రైలర్‌

హైదరాబాద్‌: ‘‘ఎగసి పడే కెరటాలను ఎదురు చూసే సముద్ర తీరాన్ని నేను.. పిల్లగాలి కోసం ఎదురు చూసే నల్లమబ్బులా.. ఓర చూపు కోసం.. నీతో ఒక నవ్వు కోసం.. రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది నా హృదయం.. నా వైపు ఓ చూపు అప్పు ఇవ్వలేవా’’ అంటూ తన ప్రేయసి గురించి కవిత అందుకున్నారు యువ కథానాయకుడు శర్వానంద్‌. సమంతతో కలిసి ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘జాను’. సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకుడు. తమిళ సూపర్‌హిట్‌ ‘96’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ఆద్యంతం యువ హృదయాలను ఆకట్టుకునేలా, భావోద్వేగాల సన్నివేశాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. 

‘ఒక్కోసారి జీవితంలో ఏమీ జరగకపోయినా, ఏదో జరగబోతోందని మనసుకు మాత్రం ముందే తెలిసిపోతుంది’’అంటూ సమంత చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటుండగా, ‘పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే, ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు  కూడా నువ్వు సొంతమే’ అంటూ శర్వానంద్‌ చెప్పిన డైలాగ్‌ యువ హృదయాలను మెలిపెడుతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘జాను’ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తుండగా, గోవింద్‌ వసంత్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని