‘డాంగ్‌ డాంగ్‌’ ఫుల్‌ వీడియో ఆగయా..!
close
Updated : 30/01/2020 17:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘డాంగ్‌ డాంగ్‌’ ఫుల్‌ వీడియో ఆగయా..!

డ్యాన్స్‌తో మెస్మరైజ్‌ చేస్తున్న తమన్నా, మహేశ్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు - మిల్కీబ్యూటీ తమన్నా డ్యాన్స్‌తో మెస్మరైజ్‌ చేశారు. మహేశ్‌ కథానాయకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ వర్షం కురిపించి బాక్సాఫీస్‌గా బాప్‌గా నిలిచిన ఈ సినిమా అటు దర్శకుడు అనిల్‌ రావిపూడితోపాటు ఇటు మహేశ్‌కు కూడా కెరీర్‌లో ఓ మంచి హిట్‌ను అందించింది. అయితే ఈ సినిమా మిల్కీబ్యూటీ తమన్నా ‘డాంగ్‌ డాంగ్’ అనే పార్టీ సాంగ్‌తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ పాటలో తమన్నా, మహేశ్‌ వేసిన స్టెప్పులు థియేటర్లలో ప్రేక్షకుల చేత విజిల్స్‌ వేయించాయి.ఈ నేపథ్యంలో చిత్రబృందం నేడు ‘డాంగ్‌ డాంగ్‌’ పాట పూర్తి వీడియోను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ.. దేవిశ్రీ సంగీతం సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది. మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో మహేశ్‌ కనిపించిన ఈ సినిమాలో ఆయనకు జంటగా రష్మిక నటించారు. విజయశాంతి, రావు రమేశ్‌, రాజేంద్రప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌ , సంగీత కీలకపాత్రలు పోషించారు.

 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని