సిధ్‌ శ్రీరామ్‌ నుంచి మరో లవ్‌లీ సాంగ్‌
close
Published : 31/01/2020 21:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సిధ్‌ శ్రీరామ్‌ నుంచి మరో లవ్‌లీ సాంగ్‌

హైదరాబాద్‌: బుల్లితెరపై తనదైన మాటలు, పంచ్‌లతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న యాంకర్‌ ప్రదీప్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘30రోజుల్లో ప్రేమించటం ఎలా’. అమృత అయ్యర్‌ కథానాయిక. మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని తొలి పాటను అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు విడుదల చేశారు.

ఈ సందర్భంగా పాటను ట్విటర్‌ వేదికగా పంచుకుంటూ, ‘నీలి నీలి ఆకాశం పాటను విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది. 30రోజుల్లో ప్రేమించటం ఎలా చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’’ అని ట్వీట్‌ చేశారు. ఈ పాటకు అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చగా, చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. సిధ్‌ శ్రీరామ్‌, సునీత ఆలపించారు. ఎస్వీపీ పిక్సర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు. సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించిన మరో లవ్‌లీ సాంగ్‌ను మీరూ చూసేయండి.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని