రజనీ‌-నయన్‌ మరోసారి..!
close
Published : 31/01/2020 21:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రజనీ‌-నయన్‌ మరోసారి..!

చెన్నై: రజనీకాంత్‌-నయనతార మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులో అలనాటి తారలు మీనా, ఖుష్భూలు కీలక పాత్రలు పోషిస్తుండగా, ఇప్పుడు నయనతార కూడా వచ్చి చేరింది. మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దర్బార్‌’ చిత్రంలో రజనీకి జోడీగా నయన్‌ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి నటించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ విషయాన్ని సన్‌ పిక్చర్స్‌ అభిమానులతో పంచుకుంది.

ఈ చిత్రానికి  ‘మన్నవన్’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించనుందట. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తోంది. ఇక ఇందులో కీర్తి సురేష్‌ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.  
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని