సింగిల్స్‌ ఆర్మీని లీడ్‌ చేస్తున్న సాయితేజ్‌
close
Published : 01/02/2020 14:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సింగిల్స్‌ ఆర్మీని లీడ్‌ చేస్తున్న సాయితేజ్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ యువ కథానాయకుడు సాయితేజ్‌ సింగిల్స్‌ ఆర్మీని లీడ్‌ చేస్తున్నారు. వాలెంటైన్స్‌ వీకెండ్‌ సందర్భంగా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ అంటున్నారాయన. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో నభా నటేశ్‌ కథానాయికగా కనిపించనున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను సాయితేజ్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘సోలో సోదర సోదరీమణులారా... ఈ వాలెంటైన్స్‌ వీకెండ్‌ను మనం అంతా కలిసి జరుపుకుందాం. మన స్లోగన్‌ ఒకటే.. సోలో బ్రతుకే సో బెటర్’ అని సాయితేజ్‌ పేర్కొన్నారు.

మరోవైపు శర్వానంద్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీకారం’. గ్రామీణ నేపథ్యంలో విభిన్న కథాచిత్రంతో తెరక్కుతున్న ఈ సినిమాకు కిషోర్‌ బి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల శర్వానంద్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ఓ కొత్త పోస్టర్‌ను ఇవాళ విడుదల చేసింది. వేసవి కానుకగా ఏప్రిల్‌ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని