ఆ ఏటీఎంకి వెళ్తే అంతే సంగతి..!
close
Published : 02/02/2020 19:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఏటీఎంకి వెళ్తే అంతే సంగతి..!

ఆకట్టుకుంటున్న క్రైమ్‌ థ్రిల్లర్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో క్రైమ్, సన్ఫెన్స్‌ థ్రిల్లర్‌ కథలతో తెరకెక్కిన చిత్రాలు సందడి చేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘మత్తువదలరా’, ‘అశ్వథ్థామ’ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే. తాజాగా క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలోనే తెరకెక్కుతున్న తెలుగు సినిమా ‘22’. నగరంలోని ఓ ఏటీఎంలోకి వెళ్లి ఎవరైతే బాధపడతారో చివరికి వారు హత్యకు గురి అవుతారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు నాగార్జున ఆదివారం ఉదయం విడుదల చేశారు. రూపేష్‌ కుమార్‌, సలోని మిశ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు శివకుమార్‌.బి దర్శకత్వం వహించారు. త్వరలో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

టీజర్‌ విడుదల అనంతరం నాగార్జున మాట్లాడుతూ.. ‘మహిళా డైరెక్టర్‌గా జయగారు మంచిపేరు తెచ్చుకున్నారు. నేడు ఆమె కుమారుడు శివకుమార్‌ ‘22’ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. వ్యాపార రంగంలో మంచి విజయాన్ని సాధించిన రూపేష్‌ సినిమా మీద ఉన్న ఇష్టంతో కథానాయకుడిగా పరిచయం కావడం సంతోషంగా ఉంది.’ అని తెలిపారు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని