సూర్యతో జోడీ కడుతున్నరష్మిక
close
Published : 03/02/2020 08:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సూర్యతో జోడీ కడుతున్నరష్మిక

రష్మిక

కోడంబాక్కం, న్యూస్‌టుడే: సుధ కొంగర దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘సూరరై పోట్రు’ చిత్రం ఏప్రిల్‌లో తెరపైకి రానుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత హరి దర్శకత్వంలోని చిత్రంలో సూర్య నటించనున్నారు. ఎప్పటిలాగే తనదైన మాస్‌, యాక్షన్‌ చిత్రంగా దీనిని తెరకెక్కించనున్నారు హరి. ఈ చిత్రంలో ‘మాస్టర్‌’ ఫేమ్‌ మాళవిక నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆమె స్థానంలో రష్మిక చేరినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే చర్చలు కూడా జరిగాయని సమాచారం. ప్రస్తుతం సూర్య సోదరుడు కార్తి హీరోగా తెరకెక్కుతున్న ‘సుల్తాన్‌’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది రష్మిక. త్వరలో కార్తి అన్నతోనూ ఈ అమ్మడు జతకట్టనుందని సమాచారం.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని