పవన్‌కల్యాణ్‌ ‘పింక్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!
close
Published : 03/02/2020 16:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌కల్యాణ్‌ ‘పింక్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

హైదరాబాద్‌: గత కొద్ది రోజులుగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్‌కల్యాణ్‌ తెలుగు చిత్ర పరిశ్రమ ఆశ్చర్యపోయేలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలు మొదలు పెట్టేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘పింక్‌’ రీమేక్‌లో పవన్‌ నటిస్తున్నారు. దీంతో పాటు, క్రిష్‌, హరీశ్‌ శంకర్‌ సినిమాలు కూడా ఒకే అయిపోయాయి. పవన్‌కల్యాణ్‌ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో పవన్‌ నటిస్తున్న ‘పింక్‌’ రీమేక్‌ విడుదలపై స్పష్టత వచ్చింది. ఈ సినిమాను వేసవి కానుకగా తీసుకురానున్నట్లు నిర్మాత దిల్‌ రాజ్‌ వెల్లడించారు. 

‘‘టైటిల్‌పై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. అయితే,  సినిమాను మాత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళిక రచిస్తున్నాం. ఎందుకంటే మే 11న ‘గబ్బర్‌ సింగ్‌’ విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఉగాది సందర్భంగా టైటిల్‌ను విడుదల చేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం ‘జాను’ ప్రచారంలో ఉన్నాం. ఆ తర్వాత ‘వి’ ప్రమోషన్స్‌ ప్రారంభమవుతాయి. ఆ తర్వాత పవన్‌ సినిమాపై పూర్తి దృష్టి పెడతాం’’

‘‘తొలిప్రేమ’ సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా నేను పనిచేశాను. అప్పటి నుంచే కల్యాణ్‌గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. నేను నిర్మాతను అయితే తప్పకుండా ఆయనతో సినిమా చేయాలని అప్పుడే అనుకున్నా. ఇన్నేళ్లకు కుదిరింది. ‘పింక్‌’ రీమేక్‌కు సంబంధించి చాలా మార్పులు చేశాం. హిందీ, తమిళ భాషల్లో విడుదలైన సినిమా మీకు తెలుగులో కనిపించదు. ఒక కొత్త సినిమాను చూస్తారు’’ అని దిల్‌ రాజు తెలిపారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని