కార్తిక్‌ నరేన్‌ దర్శకత్వంలో ధనుష్‌
close
Updated : 04/02/2020 08:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్తిక్‌ నరేన్‌ దర్శకత్వంలో ధనుష్‌

కోడంబాక్కం, న్యూస్‌టుడే: సత్యజ్యోతి ఫిలిమ్స్‌ బ్యానరుపై ధనుష్‌ నటించిన ‘పటాస్‌’ ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ అదే బ్యానరులో టీజీ త్యాగరాజన్‌ నిర్మాణంలో నటిస్తున్నారు ధనుష్‌. ఈ చిత్రానికి ప్రముఖ యువ దర్శకుడు కార్తిక్‌ నరేన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధ్రువంగళ్‌ పదినారు’ చిత్రంతో కార్తిక్‌ నరేన్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అరుణ్‌ విజయ్‌తో ‘మాఫియా’, అరవింద్‌స్వామితో ‘నరగాసురన్‌’ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధనుష్‌ 43వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఆయన సిద్ధమయ్యారు. ధనుష్‌, కార్తిక్‌ నరేన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇది. వాస్తవానికి రామ్‌కుమార్‌ దర్శకత్వంలో ధనుష్‌ నటిస్తున్న చిత్రమే ‘డి 43’గా ప్రకటించారు. కానీ అది కాస్త ఆలస్యమవుతున్నందున కార్తిక్‌ నరేన్‌ చిత్రం ముందు రానుందని సమాచారం. అక్టోబరులో దీనిని విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌ సంగీతం సమకూర్చుతున్నారు. ఇటీవల ధనుష్‌, జీవీ కాంబినేషన్‌లో వచ్చిన ‘అసురన్‌’ సినిమా సంగీతం పరంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ వీరు జతకడుతున్నారు. అలాగే ‘పొల్లాదవన్‌’, ‘ఆడుకలం’, ‘మయక్కం ఎన్న’, ‘అసురన్‌’ వరుసలో ఇది ఐదో చిత్రం కావడం విశేషం. యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో దీనిని రూపొందిస్తున్నారు. కథానాయిక, ఇతర సాంకేతిక కళాకారుల ఎంపిక పనులు జరుగుతున్నాయి.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని