ప్రకృతి ప్రేమికులను పరవశింపజేసే పాట
close
Published : 04/02/2020 22:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రకృతి ప్రేమికులను పరవశింపజేసే పాట

ఇంటర్నెట్‌డెస్క్‌: శర్వానంద్‌, సమంత కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘జాను’. సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. శర్వానంద్‌  ఈ చిత్రంలో రామచంద్ర అలియాస్‌ రామ్‌గా కనిపించనున్నాడు. వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా శర్వా పాత్రకు సంబంధించిన పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ‘ది లైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ పేరుతో విడుదల చేసిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రకృతిలో మమేకమై ఫొటోలు తీస్తూ శర్వా ఇందులో కనిపించారు. వన్య ప్రాణులు, పక్షులు, సముద్ర గర్భంలో జీవుల ఫొటోలను శర్వా క్లిక్‌మనిపించారు. 

గోవింద్‌ వసంత బాణీలు సమకూర్చిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. ప్రదీప్‌కుమార్‌ ఆలపించారు. ప్రకృతి ప్రేమికులను ఈ పాట తప్పకుండా అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని