అఖిల్‌ కొత్త చిత్రం టైటిల్‌ ఇదే!
close
Updated : 04/02/2020 18:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అఖిల్‌ కొత్త చిత్రం టైటిల్‌ ఇదే!

హైదరాబాద్‌: ‘హలో’, ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రాల్లో ప్రేమికుడిగా మెప్పించాడు యువ కథానాయకుడు అక్కినేని అఖిల్‌. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాస్‌, వాసు వర్మ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే నాయిక. ఫిబ్రవరి 8న సాయంత్రం 6.18గంటలకు మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మరి సినిమాకు సంబంధించి ఆ రోజు ఫస్ట్‌లుక్‌ విడుదల చేస్తారా.? లేక టీజర్‌ విడుదల చేస్తారో చూడాలి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘పరుగు’, ‘బొమ్మరిల్లు’ చిత్రాలతో సంచలనాలు సృష్టించిన భాస్కర్‌కు గత కొద్ది కాలంగా హిట్‌ లేదు. మరోవైపు అఖిల్‌ కూడా సరైన హిట్‌ కోసం వేచి చూస్తున్నారు. మరి ఇద్దరూ ఎలా అలరిస్తారో చూడాలి.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని