#RRR కొత్త విడుదల తేదీ ఇదే!
close
Published : 05/02/2020 17:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

#RRR కొత్త విడుదల తేదీ ఇదే!

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ - రామ్‌ చరణ్‌ - రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘#RRR’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ మారుతుందంటూ గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతుంటంతో అభిమానులు కూడా నిజమేనా అని అనుకుంటున్నారు. ఈ సమయంలో చిత్రబృందం అభిమానులకు ఓ సందేశం ఇచ్చింది. సినిమా విడుదల తేదీని మారుస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 8న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. తొలుత సినిమాను ఈ ఏడాది జులై 30న విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

మీరు మా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలు.. సెట్స్‌ మా కష్టాన్ని మరిపిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా సినిమాను తీర్చిదిద్దడానికి సమయాన్ని లెక్కచేయకుండా కష్టపడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమాను విడుదల చేయాలని... విడుదల తేదీని వాయిదా వేస్తున్నాం. ఇది మీ అందరికీ నిరాశకు గురిచేస్తుందని తెలుసు. కానీ ఈ సమయంలో మీకు మేలైన సినిమా అందించడానికి మరింత కృషి చేస్తాం. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న సినిమా మీ ముందుకు తీసుకొస్తాం. దీనికి చాలా సమయం ఉందని తెలుసు. అప్పటివరకు మీకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఇస్తుంటాం 

- ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం

ఎన్టీఆర్‌ సరసన ఒలీవియా మోరిస్‌ నటిస్తుండగా, రామ్‌ చరణ్‌ పక్కన ఆలియా భట్ నటిస్తోంది. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్‌దేవగణ్‌ కీలక పాత్రలో కనిపిస్తారు.ఆయనకు జోడీగా శ్రియ కనిపించబోతోందని సమాచారం. ఈ విషయంలో చిత్రబృందం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు సినిమాకు పూర్తి పేరు కూడా చెప్పాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే అభిమానుల నుంచి సలహాలు స్వీకరించిన విషయం తెలిసిందే.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని