యాక్షన్‌తో అదరగొట్టిన ధనుష్‌
close
Published : 08/02/2020 16:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యాక్షన్‌తో అదరగొట్టిన ధనుష్‌

హైదరాబాద్‌: తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు ధనుష్‌. అంతేకాదు, చిత్రాల ఎంపికలోనూ వైవిధ్యం ప్రదర్శిస్తారు. ఒకసారి ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ చేస్తే, మరోసారి కథా బలమున్న ‘అసురన్‌’లాంటి చిత్రాలతో మెప్పించడం ఆయనకే సాధ్యమైంది. తాజాగా దురై సెంథిల్‌ కుమార్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘పటాస్‌’. తెలుగులో ‘లోకల్‌ బాయ్‌’గా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెహరీన్‌ కథానాయిక. 

శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో ధనుష్‌ తండ్రీ-కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక యువకుడు తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని బాక్సర్‌గా ఎలా ఎదిగాడన్న కథకు, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు. సాయిజ్యోతి ఫిలింస్‌ పతాకంపై సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్‌-మర్విన్‌ స్వరాలు సమకూర్చారు.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని