‘బ్యాచ్‌లర్‌’గా అఖిల్‌ మొదటి అడుగు!
close
Published : 08/02/2020 21:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బ్యాచ్‌లర్‌’గా అఖిల్‌ మొదటి అడుగు!

హైదరాబాద్‌: ‘బ్యాచ్‌లర్‌’గా తన మొదటి అడుగు ఇదేనని అంటున్నారు యువ కథానాయకుడు అక్కినేని అఖిల్‌. ‘హలో’, ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రాల్లో ప్రేమికుడిగా మెప్పించిన ఆయన ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో అఖిల్‌కు సంబంధించిన లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాస్‌, వాసు వర్మ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే నాయిక. తన లుక్‌ను అభిమానులతో పంచుకుంటూ ‘‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’గా ఏడు అడుగుల్లో మొదటి అడుగు ఇదిగో.. ఏప్రిల్‌లో థియేటర్‌లలో కలుసుకుందాం’’ అని ట్వీట్‌ చేశారు. గడ్డం.. మెడల్‌ స్కార్ఫ్‌, తలపై క్యాప్‌తో చెప్పుల్లేకుండా అఖిల్‌ నడుచుకుంటూ వెళ్తున్న స్టిల్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్‌లో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గోపీ సుందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రేమ కథలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన బొమ్మరిల్లు భాస్కర్‌ ఈసారి అఖిల్‌ను ఎలా చూపిస్తారో చూడాలి.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని