‘అ!’ సీక్వెల్‌ గురించి డైరెక్టర్‌ కీలక ట్వీట్‌
close
Published : 12/02/2020 11:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అ!’ సీక్వెల్‌ గురించి డైరెక్టర్‌ కీలక ట్వీట్‌

హైదరాబాద్‌: ‘అ!’ సినిమా సీక్వెల్‌ గురించి దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కీలక ట్వీట్‌ పెట్టారు. కాజల్‌, రెజీనా, నిత్యామేనన్‌, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీనివాస్‌ అవసరాల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అ!’. వాల్‌ పోస్టర్ సినిమా పతాకంపై నేచురల్‌ స్టార్‌ నాని ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. 2018లో ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ‘అ!’ సినిమా సీక్వెల్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

తాజాగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ‘అ!’ సీక్వెల్‌ గురించి ఓ ట్వీట్‌ పెట్టారు. ‘‘అ2’ గురించి నన్ను చాలా మంది అడుగుతున్నారు. ‘అ’ సీక్వెల్‌ ప్రాజెక్ట్‌పై ఆసక్తి కనబరుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సంవత్సరం క్రితమే నేను ‘అ’ సీక్వెల్‌కు సంబంధించిన స్ర్కిప్ట్‌ రాసేశాను. ‘అ’ కంటే మరింత ఆసక్తిగా ‘అ2’ ఉండనుంది. ‘అ2’ చిత్రాన్ని పట్టాలెక్కించకపోవడానికి కారణమేమిటంటే నాకు ఇంకా సరైన నిర్మాత దొరకలేదు. నన్ను నమ్మండి.. నేను ఎంతో ప్రయత్నించాను. జరగాలని ఉన్నప్పుడు తప్పకుండా ఆ సినిమా జరుగుతుంది.’ అని ప్రశాంత్‌ వర్మ పేర్కొన్నారు.

 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని