రానా ‘హాథీ మేరే సాథీ’, టీజర్ చూశారా?
close
Updated : 12/02/2020 23:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రానా ‘హాథీ మేరే సాథీ’, టీజర్ చూశారా?

హైదరాబాద్‌: రానా కీలక పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’. ఇటీవల ఈ చిత్రంలోని రానా ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అందులో.. రానా ఇంతకు ముందెన్నడూ కనిపించని కొత్త అవతారంలో కనిపించి ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా హిందీలో ‘హాథీ మేరే సాథీ’, కన్నడలో ‘కాదన్‌’, తెలుగులో ‘అరణ్య’ పేర్లతో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర బృందం హిందీ టీజర్‌ను బుధవారం విడుదల చేసింది. అడవిని నమ్ముకొని ఉన్న ఓ ఆదివాసి.. ఆ అడవికి ఆపద వస్తే ఏం చేశాడన్న కథతో ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో జోయా హుస్సేన్‌, శ్రియ, విష్ణు విశాల్‌, సామ్రాట్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేరళలోని అడవుల్లో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి ప్రభు సోలోమన్‌ దర్శకుడు. ఏప్రిల్‌ 2న సినిమా విడుదల కానుంది.

 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని