‘భీష్మ’ లైఫ్‌ స్టోరీ ఇదే 
close
Published : 14/02/2020 10:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘భీష్మ’ లైఫ్‌ స్టోరీ ఇదే 

నితిన్‌ వీడియో పోస్ట్‌ చేసిన రష్మిక

హైదరాబాద్‌: ‘భీష్మ’ లైఫ్‌ స్టోరీ ఇదే అని అంటున్నారు నటి రష్మిక. ఈ మేరకు ఆమె నితిన్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. నితిన్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. విభిన్న కథతో ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘భీష్మ’ సినిమాని ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఇటీవల చిత్రబృందం ‘భీష్మ’ నుంచి సింగిల్స్‌ యాంథమ్‌ లిరికల్‌ను విడుదల చేయగా.. దానికి మంచి స్పందన లభించింది.

ఇదిలా ఉండగా శుక్రవారం ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సింగిల్స్‌ యాంథమ్‌’ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో నితిన్‌ వింటేజ్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఈ వీడియోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన రష్మిక.. ‘హ్యాపీ సింగిల్స్‌ డే, హ్యాపీ వాలెంటైన్స్‌ డే..!! ఈ వీడియో సాంగ్‌ను చూసి ఆనందించండి. ‘భీష్మ’ జీవిత కథ ఇదే’ అని అన్నారు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని