నయనతార వర్సెస్‌ సమంత 
close
Published : 14/02/2020 21:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నయనతార వర్సెస్‌ సమంత 

విజయ్‌ సేతుపతి గురించి..

చెన్నై: నయనతార, సమంత.. ఒకరు కోలీవుడ్‌, మరొకరు టాలీవుడ్‌లో అగ్రకథానాయికలు. మరి వీరిద్దరూ విజయ్‌ సేతుపతి కోసం గొడవ పడుతున్నారు. వీరి గొడవకు గల కారణాలు పూర్తిగా తెలియాలంటే కొంత సమయం వేచి చూడాల్సిందే. నయనతార ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కునున్న తమిళ చిత్రం ‘కాత్తువక్కుల రెందు కాదల్‌’. మొదటి సారి ఇద్దరు అగ్రకథానాయికలు సమంత, నయనతార ఈ సినిమా కోసం కలిసి పనిచేయనున్నారు. ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి కీలకపాత్రను పోషించనున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ‘కాత్తువక్కుల రెందు కాదల్‌’ సినిమాకు సంబంధించిన స్పెషల్‌ వీడియో చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. అనిరుధ్‌ స్వరాలను అందించనున్నారు.

ఇటీవల విడుదలైన ‘జాను’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు సమంత. కోలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న ‘96’ సినిమాకు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంతతోపాటు శర్వానంద్‌ కూడా కీలకపాత్రను పోషించారు. మరోవైపు నయనతార సైతం టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘సైరా’, కోలీవుడ్‌లో తెరకెక్కిన ‘బిగిల్‌’ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. ఇటీవల ఆమె నటించిన ‘దర్బార్‌’ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది.

 




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని