‘వసంతకాలం’తో భయపెడతానంటున్న నయన్‌
close
Published : 15/02/2020 20:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వసంతకాలం’తో భయపెడతానంటున్న నయన్‌

హైదరాబాద్‌: అటు తమిళంతో పాటు, ఇటు తెలుగులోనూ స్టార్‌ కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న నటి నయనతార. అగ్ర కథానాయకులతో పాటు, యువ హీరోలతోనూ ఆడిపాడుతున్న నయన్‌ అప్పుడప్పుడూ నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తోంది. ఆమె కీలక పాత్రలో చక్రి తోలేటి దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘కొలైయుత్తిర్‌ కాలం’. గతేడాది విడుదలైన ఈ హారర్‌ థ్రిల్లర్‌ మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో ‘వసంతకాలం’ పేరుతో విడుదల చేయనున్నారు. 5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు. భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడ్ ముఖ్య పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఈనెల 21న విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. 

 




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని