జర్మన్‌ సినిమా రీమేక్‌లో తాప్సీ
close
Published : 18/02/2020 23:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జర్మన్‌ సినిమా రీమేక్‌లో తాప్సీ

ముంబయి: టాలీవుడ్‌లో సత్తా చాటలేకపోయిన ముద్దుగుమ్మ తాప్సీ బాలీవుడ్‌లో రాణిస్తోంది. అక్కడ అడపాదడపా హిట్లు కొడుతూ వరుసగా సినిమా చాన్సులు కొట్టేస్తోంది. ఇప్పటికే భారతజట్టు మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ బయోపిక్‌ ‘శభాష్‌ మిథూ’ షూటింగ్‌లో బిజీగా ఉన్న తాప్సీ మరో సినిమాకు సంతకం చేసేసింది. 1998లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించిన జర్మన్‌ చిత్రం ‘రన్‌ లోలా రన్‌’ను హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో తాప్సీ. బాలీవుడ్‌ నటుడు తాహీర్‌ రాజ్‌ కనిపించనున్నారు. 
ఈ సినిమా గురించి తాప్సీ మాట్లాడుతూ.. ‘ఇలాంటి దిగ్గజ చిత్రాలను భారతీయ భాషల్లోకి అనువదించడం శుభపరిణామం. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొంది. ఈ ఏప్రిల్‌లో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. తాప్సీ నటించిన ‘తప్పడ్‌’ ఫిబ్రవరి 28న, తాహీర్‌ నటించిన ‘83’ సినిమా ఏప్రిల్‌ 10న అభిమానుల ముందుకు రానున్నాయి.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని