పదికోట్లలో ఒక్కడి కోసం గౌతమ్‌మీనన్‌ సెర్చ్‌
close
Updated : 19/02/2020 14:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పదికోట్లలో ఒక్కడి కోసం గౌతమ్‌మీనన్‌ సెర్చ్‌

విలన్‌గా మారిన దర్శకుడు

హైదరాబాద్‌: ‘నోమోర్‌ షార్ట్‌ కట్స్‌.. న్యూ లైఫ్‌.. న్యూ బిగినింగ్స్‌.. అందులో రైటో, రాంగో మేము ఆలోచించలేదు. మేము చేసిన బుర్ర తక్కువపని ప్రేమించడం’ అని అంటున్నారు మలయాళీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌. ‘మహానటి’ చిత్రంతో జెమినీ గణేషన్‌గా మెప్పించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఆయన ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న మలయాళీ చిత్రం ‘కన్నుమ్‌ కన్నుమ్‌ కోలైయాదితాల్‌’. దేసింఘ్‌ పెరియాసామీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో దుల్కర్‌ సల్మాన్‌కు జంటగా రీతూవర్మ కనిపించనున్నారు. ఆన్‌లైన్‌ ట్రెడింగ్‌కు సంబంధించిన విభిన్న కథా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. 

‘ఇండియాలో ఆన్‌లైన్‌ ట్రేడ్‌కి వర్త్‌ ఎంతో తెలుసా. రెండు లక్షల కోట్లు. సుమారు పదికోట్ల మంది ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నారు. మనం వెతికేవాడు ఆ పదికోట్లలో ఒక్కడు’ అని గౌతమ్‌ మీనన్‌ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ప్రతినాయకుడిగా గౌతమ్‌ మీనన్‌ నటన ప్రేక్షకులను మెప్పించేలా ఉంది.  సన్నివేశాలకు తగ్గట్టు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని