విజయ్‌ దేవరకొండకు జంటగా ఈమె ఫిక్స్‌ 
close
Published : 20/02/2020 16:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయ్‌ దేవరకొండకు జంటగా ఈమె ఫిక్స్‌ 

ఫొటోలు షేర్‌ చేసిన పూరీ జగన్నాథ్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియన్‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల ముంబయిలో ప్రారంభమైంది. ఈ చిత్రానికి ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. కరణ్‌ జోహార్‌, ఛార్మి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న  ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ సరసన ఎవరు నటిస్తారనే విషయంలో అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో విజయ్‌ సరసన  అనన్యపాండే నటించనున్నారంటూ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా పూరీ జగన్నాథ్‌ అనన్య పాండేతో దిగిన పలు ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘ఛార్మి, కరణ్‌ జోహార్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ‘మా పాన్‌ ఇండియన్‌’ సినిమాలో నా హీరో విజయ్‌ దేవరకొండ సరసన నటించనున్న ముద్దుగుమ్మ అనన్యపాండేకు స్వాగతం’ అని పూరీ పేర్కొన్నారు.

యాక్షన్‌ ప్రధానంగా సాగే ఓ ప్రేమ కథతో తెరకెక్కతున్న ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ థాయ్‌లాండ్‌ వెళ్లి మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో విజయ్‌ సరసన మొదట జాన్వీ కపూర్‌ నటించనున్నారంటూ ప్రచారం జరిగింది. ప్రస్తుతం విజయ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనలు అందుకుంది. ఇందులో విజయ్‌ సరసన రాశీఖన్నా, ఇజాబెల్లె, కేథరిన్‌, ఐశ్వర్యరాజేశ్‌ నటించారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని