జగమే తంత్రం అంటున్న ధనుష్‌
close
Published : 21/02/2020 09:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జగమే తంత్రం అంటున్న ధనుష్‌

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో ‘పేట’ను తెరకెక్కించిన దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌.. ఇప్పుడు ఆయన అల్లుడు ధనుష్‌తో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ‘జగమే తందిరం’ అనే పేరును తమిళంలో ఖరారు చేశారు. తెలుగులో ‘జగమే తంత్రం’ అని పేరు పెట్టినట్టు చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇది ధనుష్‌కు 40వ చిత్రం కావడం విశేషం. దీనికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. తెల్లపంచె, చొక్కాతో తుపాకీ పట్టుకుని ధనుష్‌ వెళ్తున్నట్లు ఈ పోస్టర్‌ ఉంది. ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూర్చారు. మామతో ఓ హిట్‌ను అందుకున్న కార్తిక్‌ సుబ్బరాజ్‌ ఇప్పుడు అల్లుడితో మరో హిట్‌ను సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని