రవితేజ ‘క్రాక్‌’ టీజర్‌ వచ్చేసింది!
close
Published : 21/02/2020 18:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రవితేజ ‘క్రాక్‌’ టీజర్‌ వచ్చేసింది!

హైదరాబాద్‌: రవితేజ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్రాక్‌’. శ్రుతి హాసన్‌ కథానాయిక. మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో రవితేజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వేసవి కానుకగా మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

గతంలో రవితేజ-గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘డాన్‌శీను’, ‘బలుపు’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో తాజా చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సరస్వతి ఫిల్మ్స్‌ డివిజన్‌ పతాకంపై బి.మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని