మల్లారెడ్డి కాలేజ్‌లో హీరో విశ్వక్‌సేన్‌ సందడి!
close
Published : 22/02/2020 21:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మల్లారెడ్డి కాలేజ్‌లో హీరో విశ్వక్‌సేన్‌ సందడి!

హైదరాబాద్‌: ‘ఫలక్‌నుమా దాస్‌’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు విశ్వక్‌సేన్‌. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌’.  రుహాని శర్మ కథానాయిక. వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై నాని ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా, ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు విశేష స్పందన వస్తోంది.

ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నటుడు విశ్వక్‌సేన్‌ శనివారం మల్లారెడ్డి కాలేజ్‌లో సందడి చేశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం వారితో ఫొటోలు దిగారు. ‘ఫలక్‌నుమా దాస్‌’ను ఆదరించినట్లే ఈ సినిమాను విజయవంతం చేయాలని కోరారు. 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని