బాలయ్య పక్కన ఛాన్స్‌ కొట్టేసింది!
close
Published : 22/02/2020 21:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలయ్య పక్కన ఛాన్స్‌ కొట్టేసింది!

హైదరాబాద్‌: బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌కు జరుపుకోనుంది. ఈ చిత్రం కోసం కథానాయికల ఎంపిక చాలా రోజుల నుంచి జరుగుతోంది. ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉన్న ఈ సినిమాలో ఒక కథానాయికగా తెలుగు నటి అంజలిని ఎంపిక చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. గతంలో బాలయ్యతో కలిసి అంజలి ‘డిక్టేటర్‌’ చిత్రంలో ఆడిపాడింది. ఇప్పుడు మరోసారి బాలకృష్ణ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. 

కాగా, మరో నాయికగా శ్రియను తీసుకున్నట్లు సమాచారం. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ‘సింహా’, ‘లెజెండ్‌’ సినిమాల తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో బాలకృష్ణ అఘోరగా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వారణాశిలో చిత్రీకరణ మొదలు కానుంది.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని