#చిరు152 లుక్‌ లీక్‌
close
Published : 23/02/2020 13:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

#చిరు152 లుక్‌ లీక్‌

నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న మెగాస్టార్‌ షూటింగ్‌ ఫొటో

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరు 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైంది. షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం చిరంజీవిపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన చిరంజీవి లుక్‌ ఒకటి నెట్టింట్లో లీక్‌ అయ్యింది. ఇందులో చిరు మెడలో ఎర్ర కండువా ధరించి కనిపించారు. ఈ లుక్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిరంజీవి లుక్ చూసిన అభిమానులు.. వివిధ సందర్భాల్లో మెగా హీరోలు ఎర్ర కండువాతో ఉన్న లుక్స్‌ను యాడ్‌ చేసి నెట్టింట్లో పలు ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నారు.

దేవాదాయ శాఖలో అవినీతిని అరికట్టే కథాంశంతో చిరు-కొరటాలశివ సినిమా ఉండబోతోందని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయశాఖలో పనిచేసే ఉద్యోగిగా కనిపించనున్నారట. ఇందులో చిరుకి జంటగా త్రిష సందడి చేయనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని