నితిన్‌, వరుణ్‌ ఆరంభించేశారు
close
Updated : 24/02/2020 15:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నితిన్‌, వరుణ్‌ ఆరంభించేశారు

ఒకరు అంధుడిగా.. మరొకరు బాక్సర్‌గా

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటులు నితిన్‌, వరుణ్‌ తేజ్‌ తమ కొత్త ప్రాజెక్ట్‌ల పనులను సోమవారం నుంచి ప్రారంభించారు. ఈ మేరకు వీరిద్దరు తమ, తమ సినిమా షూటింగ్‌, పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల విడుదలైన ‘భీష్మ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నితిన్‌.. ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నారు. ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడిగా బాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ‘అంధాధున్‌’ సినిమాకి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. శ్రేష్ఠ మూవీస్‌ పతాకంపై రానున్న ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. జూన్‌ నుంచి రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. బి.మధు సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నికిత్‌రెడ్డిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

గతేడాది విడుదలైన ‘గద్దలకొండ గణేష్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా కిరణ్‌ కొర్రపాటి డైరెక్షన్‌లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. బాక్సింగ్‌ ప్రధానాంశంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్‌ బాక్సర్‌ పాత్రలో కనిపించనున్నారు. నేడు ఈ సినిమా షూటింగ్‌ వైజాగ్‌లో ప్రారంభమైంది. షూటింగ్‌ లోకేషన్‌కు సంబంధించిన ఓ ఫొటోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన వరుణ్‌.. సినిమా ఆరంభమైందని, ప్రతిఒక్కరి ఆశీస్సులు కావాలని కోరారు. అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు వెంకటేశ్‌, సిద్ధు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. తమన్‌ స్వరాలు అందించనున్నారు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని