#PSPK26FirstSingle.. మారిన ప్రొఫైల్‌ పిక్‌ 
close
Published : 27/02/2020 10:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

#PSPK26FirstSingle.. మారిన ప్రొఫైల్‌ పిక్‌ 

ట్విటర్‌ ఇండియా ట్రెండింగ్‌ రెండో స్థానంలో..

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ అభిమానులకు త్వరలో సర్‌ప్రైజ్‌ రానుంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘పింక్‌’ సినిమా రీమేక్‌ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ త్వరలో విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర సంగీత దర్శకుడు తమన్‌ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ఆయనకు అతిపెద్ద అభిమానినైన నేను కూడా #PSPK26FirstSingle విడుదల కోసం ఎదురు చూడలేకపోతున్నాను. #PSPK26 కోసం మా బృందం మొత్తం ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. ఇది మాకే కాదు అందరికీ ఎంత ముఖ్యమో బాగా తెలుసు. పవన్‌కల్యాణ్‌ చిత్రానికి ఉత్తమ సంగీతాన్ని అందించేందుకు మేము కృషి చేస్తున్నాం. లవ్‌ యూ ఆల్‌. #firstsingle #PSPK26FirstSingle త్వరలో రానుంది’ అని తమన్‌ ట్వీట్‌ చేశారు. ట్వీట్స్‌తోపాటు ఆయన పవన్‌ ఫొటోతో ట్విటర్‌ ప్రొఫైల్‌ పిక్‌ను కూడా మార్చేశారు. తమన్‌ ట్వీట్‌ చూసిన పవన్‌ అభిమానులు #PSPK26FirstSingle హ్యాష్‌ట్యాగ్‌తో పలు ట్వీట్లు చేస్తూ తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో #PSPK26FirstSingle అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌ ఇండియా ట్రెండింగ్‌తో దూసుకెళ్తోంది.

రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల కొంతకాలంపాటు సినిమాలకు దూరంగా పవన్‌ ప్రస్తుతం కథానాయకుడిగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పింక్‌’ సినిమా రీమేక్‌గా పవన్‌ సినిమా తెరకెక్కుతోంది. దిల్‌రాజు ఈ చిత్ర నిర్మాత. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మేలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దిల్‌రాజు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరోవైపు ఈ చిత్రానికి ‘వకీల్‌సాబ్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది. 



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని