‘అల..వైకుంఠపురం’తో బన్నీ సెల్ఫీ..!
close
Published : 27/02/2020 19:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అల..వైకుంఠపురం’తో బన్నీ సెల్ఫీ..!

ఆకట్టుకుంటున్న టైటిల్‌ వీడియో

హైదరాబాద్‌: టాలీవుడ్‌ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘అల..వైకుంఠపురములో..’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి పూర్తి వీడియో సాంగ్స్‌ను ఒక్కొక్కటిగా చిత్రబృందం విడుదల చేస్తోంది. 

ఇప్పటికే ‘సామజవరగమన’, ‘ఓ మైగాడ్‌ డాడీ’ పాటలతో మెప్పించిన చిత్రబృందం తాజాగా గురువారం ‘అల.. వైకుంఠపురములో..’ టైటిల్‌ సాంగ్‌ను వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ప్రారంభంలో ‘వైకుంఠపురం’ వద్దకు చేరుకున్న బన్నీ.. ఇంటి బయట నిల్చుని సెల్ఫీ తీసుకుంటు కనిపించారు. ప్రియా సిస్టర్స్‌, శ్రీకృష్ణ అలపించిన ఈ పాటకు తమన్‌ స్వరాలు అందించారు. ఈ సినిమాలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటించి మెప్పించారు. టబు, మురళీశర్మ, రాజేంద్రప్రసాద్‌, నివేదా పేతురాజ్‌, సుశాంత్‌, నవదీప్‌, సునీల్‌ కీలకపాత్రలు పోషించారు. 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని