ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి సర్‌ప్రైజ్‌..!
close
Published : 28/02/2020 15:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి సర్‌ప్రైజ్‌..!

అభిమాని పోస్ట్‌కి చిత్రబృందం రిప్లై 

హైదరాబాద్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అభిమానులకు త్వరలో ఓ సర్‌ప్రైజ్‌ రానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. టాలీవుడ్‌ అగ్రనటులు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా 2020లో విడుదల కానుందని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇవ్వాలంటూ నెటిజన్లు చిత్రబృందానికి ట్వీట్లు కూడా పెట్టారు. దీంతో వచ్చే ఏడాది జనవరి 8న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాని విడుదల చేస్తామని, అప్పటివరకూ మధ్య మధ్యలో సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తూనే ఉంటామని చిత్రబృందం ఫిబ్రవరి 5న ట్వీట్‌ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ అభిమాని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పేజ్‌ను ట్యాగ్‌ చేస్తూ కోపంగా ఉన్న ఎమోజీలతో.. ‘అప్‌డేట్స్ ఇంకెప్పుడు ఇస్తావ్‌’ అని ట్వీట్‌ చేశాడు. అభిమాని ట్వీట్‌పై స్పందించిన సదరు చిత్రబృందం మార్చిలో సర్‌ప్రైజ్‌ ఇస్తామని ప్రకటించింది. మరో రెండు రోజుల్లో మార్చి నెల రాబోతుండడంతో అభిమానుల్లో సంతోషం మరింత పెరిగింది. దీంతో #RRRUpdatesFromMarch అనే హ్యాష్‌ట్యాగ్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌.. కొమరం భీంగా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. ఇందులో రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ కనిపించనుండగా.. ఎన్టీఆర్‌కు జంటగా ఒలివియా మోరీస్‌ నటించనున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవగణ్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని