‘భీష్మ’ కలెక్షన్ల వర్షం
close
Published : 28/02/2020 22:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘భీష్మ’ కలెక్షన్ల వర్షం

ప్రకటించిన చిత్ర నిర్మాణ సంస్థ

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు నితిన్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నితిన్‌కు జంటగా రష్మిక నటించారు. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సినీ ప్రియుల నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. నాన్‌స్టాప్‌ కామెడీతో ఫుల్‌టైం ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ ‘భీష్మ’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పేర్కొంది. ఈ మేరకు ‘భీష్మ’ చిత్రానికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది.

‘భీష్మ’ సినిమాకు మంచి విజయాన్ని అందించినందుకుగాను అభిమానులతో శనివారం థ్యాంక్స్‌ మీట్‌ను నిర్వహించనున్నారు. వైజాగ్‌లోని గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్‌ వేదికగా తెలియజేసింది.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని