అసలు పేరుతో మోహన్‌బాబు
close
Published : 28/02/2020 20:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అసలు పేరుతో మోహన్‌బాబు

సూర్య సినిమాలో డైలాగ్‌ కింగ్‌ లుక్‌ చూశారా?

హైదరాబాద్‌: సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా!’ అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకుడు జీఆర్‌ గోపీనాథ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కతున్న చిత్రమిది. ఈ సినిమాలో అగ్ర నటుడు మోహన్‌బాబు కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం ‘ఆకాశమే నీ హద్దురా’లో మోహన్‌బాబు స్టిల్స్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. విశేషమేమింటే ఈ సినిమాలో మోహన్‌బాబు పోషించిన పాత్ర పేరు భక్తవత్సలం నాయుడు. ఇదే ఆయన అసలు పేరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తమిళ వెర్షన్‌లో తన పాత్రకు మోహన్‌బాబు స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకున్నారు.

సూర్యకు జంటగా అపర్ణ బాలమురళి నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ‘పిల్లాపులి’ అనే పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఊర్వశి, జాకీష్రాఫ్‌ ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని