‘సరిలేరునీకెవ్వరు’ స్పెషల్‌ ప్రోమో చూశారా
close
Updated : 29/02/2020 11:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సరిలేరునీకెవ్వరు’ స్పెషల్‌ ప్రోమో చూశారా

పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో ఆకట్టుకున్న వీడియో

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 50 రోజులైన సందర్భంగా చిత్రబృందం ఓ స్పెషల్‌ వీడియోను శనివారం విడుదల చేసింది. ఇందులో మహేశ్‌బాబు గురించి అజయ్‌.. ప్రకాశ్‌రాజ్‌కు చెబుతూ కనిపించారు. ‘కర్నూలు కొండారెడ్డి బురుజుకాడ అల్లూరి సీతారామరాజుని నేను చూసినా అన్నా. చుట్టూ 50మంది.. చేతిలో కత్తిలే, గొడ్డలిలే ఎట్టా నిలబడినాడో.. అచ్చం ఈయన లెక్కనే రొమ్మిరిసి..(అల్లూరి సీతారామరాజు గెటప్‌లో ఉన్న కృష్ణను చూపిస్తూ)’ అని పవర్‌ఫుల్‌గా చెప్పారు.

‘సరిలేరునీకెవ్వరు’ సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్‌స్టార్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సోషల్‌మీడియా వేదికగా మహేశ్‌ పోస్టర్లను షేర్‌ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం #SarileruNeekevvaru, #50DaysOfBBSLN అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్విటర్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్నాయి. మరోవైపు చిత్రబృందం సైతం ‘మీ ఆత్మీయతకి, అభిమానానికి, ఆదరణకి Take A Bow’ అని పేర్కొంటూ కొన్ని పోస్టర్లను నెట్టింట్లో పోస్ట్‌ చేసింది.

మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో మహేశ్‌ నటించిన ఈ చిత్రంలో అలనాటి తార విజయశాంతి కీలకపాత్ర పోషించారు. రాజేంద్రప్రసాద్‌, ప్రకాశ్‌, సంగీత, అజయ్‌, రావురమేశ్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాలో మహేశ్‌కు జంటగా రష్మిక నటించి మెప్పించారు. అనిల్‌సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. దేవిశ్రీ స్వరాలు అందించారు.

 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని