అమ్మవారిపాత్రలో నయనతార
close
Published : 29/02/2020 22:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మవారిపాత్రలో నయనతార

చెన్నై: అగ్ర కథానాయిక నయనతార అమ్మవారి పాత్రలో కనిపించనున్నారు. ఆమె ఇప్పటికే ‘రామరాజ్యం’ సినిమా కోసం సీతగా నటించి ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘మూకుత్తి అమ్మన్‌’ సినిమాలో నయన్‌ అమ్మవారి గెటప్‌లో దర్శనమివ్వబోతున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. ఇందులో నయన్‌ అమ్మవారి రూపంలో కనిపించి, ఆకట్టుకున్నారు. ఆర్జే బాలాజీ, ఎన్‌జే శరవణన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
‘దర్బార్‌’ తర్వాత నయన్‌ ‘నెట్రికన్‌’, ‘మూకుత్తి అమ్మన్‌’ సినిమాల్లో నటిస్తున్నారు. దీంతోపాటు మరో తమిళ సినిమాలోనూ కనిపించనున్నారు. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలోనూ నయన్‌ నటించబోతున్నట్లు సమాచారం.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని