మెలోడితో అఖిల్‌ సందడి షురూ..! 
close
Published : 02/03/2020 12:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెలోడితో అఖిల్‌ సందడి షురూ..! 

‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ ఫస్ట్‌సాంగ్‌ వచ్చేసింది

హైదరాబాద్‌: ‘మనసా.. మనసా.. మనసా మనసా మనసారా బతిమాలా తన వలలో పడిపోకే మనసా’ అని అంటున్నారు టాలీవుడ్‌ యువ కథానాయకుడు అక్కినేని అఖిల్‌. ‘హలో’, ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రాలతో మెప్పించిన ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. ఈ చిత్రానికి ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అఖిల్‌కు జంటగా పూజాహెగ్డే నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ‘మనసా మనసా’ అంటూసాగే ఫస్ట్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను చిత్రబృందం సోమవారం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. సిద్‌ శ్రీరామ్‌ అలపించిన ఈ మెలోడి ప్రేక్షకులను మెప్పించేలా ఉంది.  

జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీవాస్‌, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీసుందర్‌ బాణీలను అందిస్తున్నారు. ‘మనసా మనసా’ లిరికల్‌ వీడియోను అఖిల్‌ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంటూ.. ‘మనసా మనసా వచ్చేసింది. ఈ పాట నాలో సంతోషాన్ని, పాజిటివిటీని పెంచుతుంది. ఆ పాటకు సంగీతం అందించిన గోపీసుందర్‌తోపాటు జీవం పోసిన సిద్‌ శ్రీరామ్‌కు ధన్యవాదాలు. ఈ పాట ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. వేసవి కానుకగా ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని