ఫైట్‌ సీక్వెన్స్‌తో బాలయ్య సినిమా..!
close
Published : 02/03/2020 19:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫైట్‌ సీక్వెన్స్‌తో బాలయ్య సినిమా..!

హ్యాట్రిక్‌ కోసం సర్వం సిద్ధం

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు బాలకృష్ణ కొత్త సినిమా చిత్రీకరణ ఆరంభమైంది. బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సింహా’, ‘లెజెండ్‌’ సినిమాల తర్వాత బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. ఈ చిత్రానికి మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమం జరుపుకున్న ఈ సినిమా చిత్రీకరణ సోమవారం నుంచి రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. చిత్రీకరణలో భాగంగా బాలకృష్ణపై ఓ యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ బోయపాటి సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ‘స్టార్ట్‌ కెమెరా, యాక్షన్‌, నా కొత్త సినిమా షూటింగ్‌ నేటి నుంచి ఆరంభమైంది’ అని బోయపాటి పేర్కొన్నారు. 

NBK106 సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారని సమాచారం. ఒక పాత్రలో ఆయన అఘోరాగా కనిపిస్తారని తెలుస్తోంది. పాత్రల్ని దృష్టిలో ఉంచుకుని ఆయన 25 కిలోలకుపైగా బరువు తగ్గారు. వారణాసి నేపథ్యంలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా అంజలితోపాటు మరో కథానాయిక కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. మణిశర్మ స్వరాలు అందించనున్నారు. విలన్‌గా శ్రీకాంత్‌ నటించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని