అడివిశేష్‌ సినిమాలో మరోసారి ఆ నటి..!
close
Published : 02/03/2020 22:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అడివిశేష్‌ సినిమాలో మరోసారి ఆ నటి..!

హైదరాబాద్‌: విభిన్న కథా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్‌ యువ కథానాయకుడు అడివి శేష్‌. ‘గూఢచారి’, ‘ఎవరు’ చిత్రాలతో మెప్పించిన ఆయన ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మేజర్’.  మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహేశ్‌ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణలో తాజాగా నటి శోభితా ధూళిపాళ్ల భాగమయ్యారు. ఇప్పటికే ‘గూఢచారి’ సినిమాతో అడివిశేష్‌-శోభితా మెప్పించిన విషయం తెలిసిందే. ‘మేజర్‌’ సినిమాలో శోభితా పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండనుంది. ఈ మేరకు ఆమె సోమవారం ‘మేజర్‌’ షూటింగ్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోను అడివి శేష్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు.  

‘గూఢచారి’ సినిమా తర్వాత ‘మేజర్‌’ సినిమా కోసం శోభితా ధూళిపాళ్లతో కలిసి పనిచేయడం తనకెంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ‘మేజర్‌’ సినిమాలో ఆమె పాత్ర చాలా స్పెషల్‌గా ఉండనుందని, అంతేకాకుండా ఎన్నో భావోద్వేగాలతో నిండిన ఆమె పాత్ర ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు, హిందీ భాషల్లో విడుదలకానున్న ఈ సినిమాకి శశికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని