నీ కన్ను నీలి సముద్రం.. వచ్చేసింది..!
close
Published : 02/03/2020 19:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నీ కన్ను నీలి సముద్రం.. వచ్చేసింది..!

అలల మధ్య పుట్టిన ప్రేమ పాట ఇది

హైదరాబాద్‌: టాలీవుడ్‌ యువ కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. ఓ విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వైష్ణవ్‌తేజ్‌కు జంటగా కృతిశెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే నటీనటుల ప్రీలుక్స్‌, ఫస్ట్‌లుక్స్‌తో మెప్పించిన చిత్రబృందం తాజాగా ‘ఉప్పెన’ ఫస్ట్‌సాంగ్‌ను లిరికల్‌ వీడియోను విడుదల చేసింది. ‘నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో అందులో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం.. నన్ను తీరానికి లాగేటి దారం దారం.’ అంటూ సాగే ఈ ప్రేమ పాట ప్రేక్షకులను మెప్పించేలా ఉంది.

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతోపాటు సుకుమార్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కోలీవుడ్‌ నటుడు విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

 




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని