వావ్‌.. పవన్‌ లుక్‌ అదిరిపోయింది..!
close
Published : 02/03/2020 17:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వావ్‌.. పవన్‌ లుక్‌ అదిరిపోయింది..!

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. తమ అభిమాన కథానాయకుడు వెండితెరపై కనిపిస్తే చూడాలని ఆశపడిన వాళ్లకు ఫస్ట్‌గిఫ్ట్‌ అందింది. ‘అజ్ఞాతవాసి’ తర్వాత పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత ఆయన మళ్లీ నటించేందుకు పచ్చజెండా ఊపారు. ఆయన కీలక పాత్రలో వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. సోమవారం ఈ చిత్రానికి సంబంధించి పవన్‌ ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను ప్రకటించారు. 

ఈ సినిమాకు ‘వకీల్‌సాబ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. చేతిలో పుస్తకం, కళ్లజోడు పెట్టుకుని పడుకొని ఉన్న పవన్‌లుక్‌ అభిమానులను విశేషంగా అలరిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్‌’ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. 

పవన్‌ చివరిగా 2018లో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన  ‘అజ్ఞాతవాసి’లో నటించారు. ఆ తర్వాత ఆయన మరో చిత్రం చేయలేదు. రాజకీయాల్లో తీరికలేకుండా గడపటంతో ఆయన సినిమా చేసే అవకాశం రాలేదు. గత కొంతకాలంగా సినీ ప్రముఖులతో పాటు, అభిమానులు సైతం పవన్‌కల్యాణ్‌ మళ్లీ సినిమాల్లో నటించాలని కోరుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పింక్‌’ రీమేక్‌ ఆయన వద్దకు రావడం, పైగా సందేశాత్మక చిత్రం కావడంతో వెంటనే ఒప్పుకొన్నారు. వేసవి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని