రాములో రాములా.. ఫుల్‌ సాంగ్‌ వచ్చేసిందిరో..!
close
Published : 03/03/2020 17:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాములో రాములా.. ఫుల్‌ సాంగ్‌ వచ్చేసిందిరో..!

హైదరాబాద్‌: ‘రాములో.. రాములా..’ అంటూ మాస్‌ను విశేషంగా అలరించారు అల్లు అర్జున్‌. ఆయన కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథానాయిక. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవలే 50రోజులు పూర్తి చేసుకుంది. 

తమన్‌ అందించిన పాటలకు శ్రోతల నుంచి విశేష స్పందన వచ్చింది. యూట్యూబ్‌, ఎఫ్‌ఎం, మ్యూజిక్‌ ఛానళ్లలో ఎక్కడ విన్నా, చూసినా ఇవే పాటలు. తాజాగా చిత్ర బృందం సినిమాలోని ఒక్కో పాటను అభిమానులతో పంచుకుంది. ‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మ’, ‘ఓ మైగాడ్‌ డాడీ’ వీడియో పాటలను నెటిజన్లకు అందించగా తాజాగా, మాస్‌ సాంగ్‌ ‘రాములో రాములా..’ పాటను షేర్‌ చేసింది. తమన్‌ స్వరాలకు కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించారు. అనురాగ్‌ కులకర్ణి, మంగ్లీ ఈ పాటను ఆలపించారు. ఇందులో బన్ని స్టెప్‌లు అభిమానులను అలరిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి.

 






మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని