రెజీనా ఒంటికి గాయాలు.. కళ్లలో బాధ..!
close
Published : 03/03/2020 18:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెజీనా ఒంటికి గాయాలు.. కళ్లలో బాధ..!

లుక్ అదిరింది

హైదరాబాద్‌: విభిన్నమైన కథలకు ప్రాధాన్యం ఇస్తున్న కథానాయిక రెజీనా. ‘అ!’ నుంచి ఆమె కథల ఎంపిక శైలి మారింది. ‘ఎవరు’ తర్వాత రెజీనా తెలుగులో నటిస్తున్న చిత్రం ‘నేనే నా..?!’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను కథానాయకుడు వరుణ్‌తేజ్‌ విడుదల చేశారు. చిత్ర బృందానికి గుడ్‌లక్‌ చెప్పారు. ఈ తొలి ప్రచార చిత్రంలో రెజీనా ఇనుప రేకులతో కప్పి ఉన్న ఓ సన్నని గదిలో బంధించి ఉన్నట్లు కనిపించారు. ఆమె ఒంటికి రక్తం, కళ్లలో ఏదో బాధ ఉన్నట్లు తెలుస్తోంది. కథపై ఆసక్తిని పెంచేలా ఉన్న ఈ ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకుంటోంది. అంతేకాదు రెజీనా ఓ రాణి గెటప్‌లో కనిపించారు. మరి ఇందులో ఆమె పాత్ర గురించి తెలియాలంటే వేచిచూడాల్సిందే.

‘నేనే నా..?!’ సినిమాకు కార్తిక్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఆపిల్‌ ట్రీ స్టూడియోస్‌ పతాకంపై రాజ్‌ శేఖర్‌ వర్మ నిర్మిస్తున్నారు. ఇందులో మిగిలిన తారాగణం వివరాలు తెలియాల్సి ఉంది. వేసవిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 


Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని