అనుష్క కోసం నాని..!
close
Updated : 04/03/2020 10:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనుష్క కోసం నాని..!

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా ట్రైలర్‌ విడుదల కాబోతోంది. మార్చి 6న మధ్యాహ్నం 12.12 గంటలకు  నేచురల్‌ స్టార్‌ నాని ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ కోన ఫిల్మ్స్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. హిందీ ట్రైలర్‌ను నటుడు మనోజ్‌ భాజ్‌పాయ్‌ విడుదల చేయబోతున్నారు. నిజానికి ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ఏప్రిల్‌ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

‘నిశ్శబ్దం’ సినిమాకు హేమంత్ మధుకర్‌  దర్శకత్వం వహిస్తున్నారు. మాధవన్‌, షాలినీ పాండే, అంజలి, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన వెంకట్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘భాగమతి’ హిట్‌ తర్వాత స్వీటీ పూర్తిస్థాయిలో నటిస్తున్న సినిమా ఇది. నవంబరులో విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని