24గంటల్లో ‘వకీల్‌సాబ్‌’ రికార్డ్‌
close
Published : 03/03/2020 20:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

24గంటల్లో ‘వకీల్‌సాబ్‌’ రికార్డ్‌

హైదరాబాద్‌: ‘ట్రెండ్‌ ఫాలో కాను.. సెట్‌ చేస్తా’ ఎప్పుడో ‘గబ్బర్‌సింగ్‌’లో పవన్‌కల్యాణ్‌ చెప్పిన డైలాగ్‌ ఇది. ఇప్పటికీ అదే నిజమని నిరూపిస్తున్నారు పవర్‌స్టార్‌. ఆయన కథానాయకుడిగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. సోమవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతే పవన్‌ అభిమానులు పండగ చేసుకున్నారు. అంతేకాదు, ఒక్క పోస్టర్‌తోనే పవర్‌స్టార్‌ రికార్డులు సృష్టించారు. ఫస్ట్‌లుక్‌ విడుదలైన 24గంటల్లోనే దేశంలోనే అత్యధికంగా 3.5 మిలియన్‌ టైటిల్‌ ట్యాగ్‌లతో పోస్టయిన్‌ ఫస్ట్‌లుక్‌గా ‘వకీల్‌సాబ్’ రికార్డు సృష్టించింది. 

ఇక తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో అత్యధికంగా 25.3 వేల రీట్వీట్లు చేసిన ఫస్ట్‌లుక్‌గానూ ‘వకీల్‌సాబ్‌’దే రికార్డు. ఒక్క ఫస్ట్‌లుక్కే ఇలా దూసుకుపోతుంటే, మరి రేపు టీజర్‌, ట్రైలర్‌ను ఏ రికార్డులు బద్దలు కొడతాయో చూడాలి. అమితాబ్‌ కీలక పాత్రలో హిందీలో తెరకెక్కిన ‘పింక్‌’ రీమేక్‌గా ‘వకీల్‌సాబ్‌’ వస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోనీ కపూర్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దాదాపు చిత్రీకరణ జరుపుకొన్న ఈ సినిమా వేసవి కానుకగా మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని