ఉత్కంఠగా అనుష్క ‘నిశ్శబ్దం’ ట్రైలర్‌
close
Published : 06/03/2020 12:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉత్కంఠగా అనుష్క ‘నిశ్శబ్దం’ ట్రైలర్‌

హైదరాబాద్‌: ‘ఒక ఘోస్ట్‌ ఇదంతా చేసిందనడానికి నా సెన్సిబులిటీస్‌ ఒప్పుకోవడం లేదు’ అంటున్నారు కథానాయిక అంజలి. అనుష్క, మాధవన్‌, అంజలి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు. శుక్రవారం యువ కథానాయకుడు నాని ‘నిశ్శబ్దం’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘ఇదిగోండి ‘నిశ్శబ్దం’ ట్రైలర్‌. మన స్వీటెస్ట్‌ స్వీటీ నటించిన థ్రిల్లర్ మిమ్మల్ని ఉత్కంఠతో సీటు చివరిన కూర్చోబెడుతుంది. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’’ అని ట్వీట్‌ చేశారు.

ఇందులో అనుష్క బదిర యువతిగా నటించింది. ట్రైలర్‌ను చూస్తుంటే సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘నిశ్శబ్దం’ ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన వెంకట్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘భాగమతి’ తర్వాత అనుష్క కీలక పాత్రలో నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. 




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని