మోహన్‌లాల్‌ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసిన చిరు
close
Published : 06/03/2020 20:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోహన్‌లాల్‌ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసిన చిరు

హైదరాబాద్‌: వైవిధ్యమైన కథలను,  పాత్రలను ఎంచుకుంటూ యువ కథానాయకులకు దీటుగా ముందుకు సాగుతున్న మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌. ఆయన కథానాయకుడిగా ప్రియదర్శన్‌ దర్శకత్వంతో తెరకెక్కిన హిస్టారికల్‌ చిత్రం ‘మరక్కార్‌: అరేబియా సముద్ర సింహం’. ప్రియదర్శన్‌ ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశారు. 

‘‘నా ప్రియ స్నేహితుడు మోహన్‌లాల్‌, ప్రియదర్శన్‌ కలల  ప్రాజెక్టు అయిన  ‘మరక్కార్‌: అరేబియా సముద్ర సింహం’ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉంది. సినిమాటోగ్రాఫర్‌ తిరుకు, చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’’ - చిరంజీవి

దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటివరకూ మలయాళంలో ఇంత భారీ బడ్జెట్‌తో మరే చిత్రమూ రాకపోవడం గమనార్హం. బాబూరాజ్‌, మంజు వారియర్‌, కీర్తి సురేశ్‌, సునీల్‌ శెట్టి, అర్జున్‌, ప్రభు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను మలయాళ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో మార్చి 26న విడుదల చేయనున్నారు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని