సైబర్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌లో విశాల్‌
close
Published : 07/03/2020 09:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సైబర్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌లో విశాల్‌

చెన్నై: విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మాణంలో ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చక్ర’. విశాల్‌ హీరోగా నటిస్తున్నారు. శ్రద్ధ శ్రీనాథ్‌ కథానాయిక. రెజీనా ముఖ్యపాత్ర పోషిస్తోంది. సైబర్‌క్రైం నేపథ్యంలో సాంకేతిక థ్రిల్లర్‌ కథాంశంతో దీన్ని రూపొందిస్తున్నారు. మే నెల ఒకటో తేదీన సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు ప్రకటించాయి.

ఈ సందర్భంగా దర్శకుడు ఆనందన్‌ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు ఎళిల్‌ వద్ద శిష్యరికం చేశా. విశాల్‌కు ఈ కథ వినిపించిన వెంటనే అంగీకరించారు. తానే నిర్మిస్తానని కూడా చెప్పడం విశేషం. నా కోసం పాత్రలను ఏమాత్రం మార్చకండని చెప్పారు. ఈ సినిమాలో మహిళా పోలీసు అధికారి పాత్ర కూడా చాలా కీలకం. ఆ పాత్ర కోసం పలువురి పేర్లను పరిశీలించాం. చివరకు శ్రద్ధ శ్రీనాథ్‌ను ఖరారు చేశాం. ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రెజీనా సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. విశాల్‌ అభిమానులకు మాత్రమే కాకుండా ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుంది. రోబోశంకర్‌, కేఆర్‌ విజయ, సృష్టిటాంగే, మనోబాలా కూడా నటించారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలో వచ్చే ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. చెన్నై, కోయంబత్తూరులో షూటింగ్‌ చేస్తున్నాం. త్వరలోనే చిత్రీకరణ పూర్తి కానుంది. సినిమాను మే ఒకటిన విడుదల చేస్తామని’’ చెప్పారు.


Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని