మగువా.. లోకానికి తెలుసా నీ విలువా..!
close
Published : 08/03/2020 13:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మగువా.. లోకానికి తెలుసా నీ విలువా..!

మనసును కదిలిస్తోన్న ‘వకీల్‌ సాబ్‌’ తొలి పాట

హైదరాబాద్‌: ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా... మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..’ అని మహిళల విలువను గుర్తు చేస్తోంది ‘వకీల్‌ సాబ్‌’ చిత్ర బృందం. రెండేళ్ల విరామం తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న సినిమా ఇది. శ్రీరామ్‌ వేణు దర్శకుడు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు. ‘అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతా పరుగులు తీస్తావు, ఇంటా బయట.. అలుపని రవ్వంత అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్లే దారంతా..’ అని సాగే ఈ గీతం శ్రోతల్ని ఆకట్టుకుంటోంది. మహిళా శక్తి, వారి త్యాగాన్ని చెబుతూ రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. సిద్ద్‌ శ్రీరామ్‌ గాత్రం పాటకు బలాన్ని చేకూర్చింది. తమన్‌ బాణీలు వినసొంపుగా ఉన్నాయి.

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాను బోనీ కపూర్‌ సమర్పిస్తున్నారు. హిందీ హిట్‌ ‘పింక్‌’కు తెలుగు రీమేక్‌ ఇది. ఇదే కథను తమిళ స్టార్‌ అజిత్‌తో ‘నేర్కొండ పార్వై’గా తీశారు. ఇప్పుడు తెలుగు రీమేక్‌ను పవన్‌ ఇమేజ్‌కు తగ్గట్టు కథలో మార్పులు చేసి, తీస్తున్నట్లు సమాచారం.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని